ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పింది యువ కథానాయిక పూజిత పొన్నాడ. తామిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని సోషల్‌మీడియాలో గాసిప్స్‌ను ప్రచారం చేయడం తనను షాక్‌కు గురి చేసిందని ఆమె పేర్కొంది. పూజిత పొన్నాడ నాయికగా నటించిన ‘ఆకాశ వీధుల్లో’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ వ్యవహారం గురించి వస్తున్న తప్పుడు కథనాల్ని ఖండిచింది పూజిత పొన్నాడ. ‘దేవిశ్రీప్రసాద్‌తో నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ప్రస్తుతం నేను సింగిల్‌గా ఉన్నా. ఇలాంటి దుష్ప్రచారాన్ని చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది’అని పూజిత పొన్నాడ పేర్కొంది.