యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయికల్లో మలయాళ భామ మమితాబైజు ఒకరు. 2017లో మలయాళ సినిమా ‘సర్వోపరి పాలకరన్’ చిత్రంతో తెరంగేట్రం చేసి, ఓ డజను మలయాళ సినిమాల్లో నటించిన ఈ భామకు ‘ప్రేమలు’ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ని నిర్వహించింది మమితా. ఈ సందర్భంగా వాళ్లడిగిన ప్రశ్నలకు చలాకీగా సమాధానాలిచ్చింది. ‘స్టార్లతో ఎందుకు నటించడం? నువ్వు పాటల్లో కనిపించి మాయమైతే మాకు నచ్చదు..’ అని ఓ అభిమాని అడిగితే.. ‘మీకు ఆ బాధ అక్కర్లేదు.
అలాంటి పాత్రలు పొరపాటున కూడా చేయను. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ నాకు మంచి పేరు తెచ్చేవే.’ అని సమాధానమిచ్చింది మమిత. ‘నిన్ను ప్యూర్ లవ్‌స్టోరీలో చూడాలనుంది.. చేయొచ్చుగా?’ అని మరో అభిమాని అడిగితే.. ‘ప్రదీప్ రంగనాథన్‌తో చేస్తున్న ‘డ్యూడ్’తో మీ కోరిక తీరుతుందిలే..’ అని జవాబిచ్చింది. ‘స్వతహాగా మీకు ఎలాంటి కథలిష్టం?’ అని ఇంకో అభిమాని అడిగితే.. ‘మనం యూత్ కదా.. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీలంటే ఇష్టం..’ అని అందంగా నవ్వేసింది మమతా బైజు.