Kamal Hasan | కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ (46) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోబో శంకర్ కమల్ హాసన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాని చనిపోయాడన్న వార్త తెలుసుకున్న నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా అతడికి నివాళులు అర్పించాడు.
రోబో శంకర్.. నీ పేరులో ఉన్న రోబో ఒక ముద్దుపేరు మాత్రమే. నువ్వు నా తమ్ముడివి. నువ్వు లేని లోటు మమ్మల్ని బాధపెడుతున్నా నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. నీ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయావు, కానీ నా పని ఇంకా మిగిలి ఉంది. రేపటిని మాకోసం వదిలి వెళ్ళిపోయావు. కాబట్టి రేపు మనదే అంటూ కమల్ రాసుకోచ్చాడు. ఇక రోబో శంకర్ అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు.
ரோபோ சங்கர்
ரோபோ புனைப்பெயர் தான்
என் அகராதியில் நீ மனிதன்
ஆதலால் என் தம்பி
போதலால் மட்டும் எனை விட்டு
நீங்கி விடுவாயா நீ?
உன் வேலை நீ போனாய்
என் வேலை தங்கிவிட்டேன்.
நாளையை எமக்கென நீ விட்டுச்
சென்றதால்
நாளை நமதே.— Kamal Haasan (@ikamalhaasan) September 18, 2025