బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ తల్లయింది. ఆదివారం మధ్యాహ్నం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు అలియా జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. డెలివరీ సమయంలో అలియాభట్ భర్త రణబీర్‌కపూర్, అత్తమ్మ నీతూ కపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ ఫ్యామిలీ పేర్కొంది.
బాలీవుడ్లో స్టార్కపుల్గా గుర్తింపు పొందిన రణబీర్‌కపూర్-అలియాభట్ నాలుగేళ్ల ప్రేయాయణం అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. రణబీర్‌కపూర్-అలియాభట్ తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టడంతో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన వార్త ఇదని, మ్యాజికల్ గర్ల్ తమ లైఫ్‌లోకి అడుగుపెట్టిందని అలియాభట్ ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది.