Yevam Movie | టాలీవుడ్ యువ నటులు చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి కన్నడ నటుడు యుగంధర్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘యేవమ్’. నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు చాందిని చౌదరి, ఆషురెడ్డిలతో పాటు భరత్‌రాజ్, కన్నడ రాయల్ స్టార్ యుగంధర్ ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వికారాబాద్ లో వరుసగా హత్యలు జరుగుతుండగా.. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ ప్రాంతంలో పోలీస్ గా జాయిన్ అవుతుంది చాందిని. మరి ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనేది చివరకి చాందిని పట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
The date is locked 🔒
💥 JUNE 14th, 2024 💥#Yevam is coming to theatres worldwide@YevamMovie #YevamMovie #YevamOnJune14th pic.twitter.com/MH9JNgSHjs— Vamsi Kaka (@vamsikaka) June 1, 2024