Alia Bhatt | బాలీవుడ్ (Bollywood) నటి అలియాభట్ (Alia Bhatt) ఓ లగ్జరీ బ్రాండ్‌కు తొలి భారతీయ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారి.. హెడ్‌లైన్స్ లో నిలిచిన విషయం తెలిసిందే. సదరు బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ Gucci Cruise 2024కు హాజరైంది అలియాభట్. స్టన్నింగ్ బ్లాక్ మినీ డ్రెస్‌లో హై హీల్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూపర్ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేసిన అలియా భట్‌ను ఓ విషయంలో మాత్రం ట్రోల్స్ చుట్టుముడుతున్నాయి.
ఇంతకీ ట్రోల్స్ కు కారణమేంటనుకుంటున్నారా..? అలియాభట్ చేతిలో ఉన్న ట్రాన్స్పరెంట్ బ్యాగ్ ఈ ట్రోల్స్ కు కారణమైంది. అలియా ఖాళీ బ్యాగ్‌ను ఎందుకు పట్టుకొచ్చింది..అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఆ పర్సు కనీసం కొన్ని వస్తువులైనా పెట్టుకునేలా ఉండాలి.. కానీ ఖాళీగా ఉంది అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. అయితే అభిమానులు మాత్రం అలియాభట్‌పై లవ్ ఎమోజీలతో ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా భట్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అవును.. నా బ్యాగు ఖాళీగానే ఉంది.. అంటూ సింపుల్ కామెంట్ పెట్టింది.
గతేడాది బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అలియాభట్.. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతోపాటు హర్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంలో కూడా నటిస్తోంది.