Spark | విక్రాంత్ (Vikrant) హీరోగా ఎంట్రీ నటిస్తోన్న చిత్రం స్పార్క్ (Spark). రుక్సార్ ధిల్లాన్, మెహరీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Pirzada) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరవింద్ కుమార్ రవివర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ సింగిల్ ఏమా అందం (YemaAndham) సాంగ్‌ను లాంఛ్ చేశారు. వైజాగ్‌లోని విజ్ఞాన్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఈవెంట్లో పాటను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా విక్రాంత్, రుక్సాన్ ధిల్లాన్ పాటకు డ్యాన్స్ చేశారు.
విక్రాంత్, రుక్సాన్ ధిల్లాన్ కాంబినేషన్లో వచ్చే ఈ బ్యూటీఫుల్ ట్రాక్‌ను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడాడు. ఖుషి చిత్రానికి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన మలయాళ కంపోజర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ కంపోజిషన్‌లో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. హేశమ్ అబ్ధుల్ వహబ్ అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు తాజా సాంగ్ చెబుతోంది.
యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న స్పార్క్‌లో నాజర్, వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సుహాసినీ మణిరత్నం, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పార్క్‌లో గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ అరవింద్ కుమార్ రవివర్మ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం. స్పార్క్ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
ఏమా అందం సాంగ్..
Team #SPARKTheLife ~ @ThisIsVikranth & @RuksharDhillon gets huge reception during the 1st single launch of #YemaAndham at Vignan Women’s Engineering College, Vizag 🤩
A @HeshamAWMusic Musical 🎹
Lyrics by #AnanthSriram ✍️
A @sidsriram Vocals 🎤 pic.twitter.com/BENNy1CCbn— BA Raju’s Team (@baraju_SuperHit) September 13, 2023