Yellamma Movie | ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు వేణు యెల్దండి. తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు ప్రారంభించిన విషయం తెలిసిందే. వేణు తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ అనే చిత్రం రాబోతుండగా.. ఈ సినిమాలో కథానాయకుడిగా నితిన్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్డ్రామా ఇదని సమాచారం. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు కథానాయిక ఒకే అవ్వలేదు. మొదట ఈ మూవీలో సాయిపల్లవిని ఎల్లమ్మ కోసం అనుకున్నారు. సాయి పల్లవి కూడా కథలోని కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో వెంటనే ఒకే కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకొని కారణాల వలన సాయి పల్లవి మధ్యలోనే తప్పుకుంది.
అనంతరం కీర్తి సురేష్‌ని ఎల్లమ్మ కోసం సంప్రదించగా.. పాత్ర బాగా ఉన్న డేట్స్ కుదరకపోవడంతో చేయలేనని చెప్పిందంట.. ఆ తర్వాత శ్రీలీలని తీసుకుందామంటే నితిన్‌తో ఇప్పటికే రెండు సినిమాలు చేయడంతో వద్దనుకున్నారు మేకర్స్. అయితే తాజాగా మళ్లీ హీరోయిన్ని వెతికే పనిలో పడ్డారు మేకర్స్. ఒక అణచివేతకు గురైన సమాజానికి చెందిన పాడే బృందం యొక్క భావోద్వేగ ప్రయాణాన్ని అన్వేషించేదే ఈ సినిమా అని తెలుస్తుంది. కథ వారి ఆకాంక్షలను, పోరాటాలను చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం కథ ఆధ్యాత్మిక అంశాన్ని జోడించి యెల్లమ్మ దేవత చుట్టూ కేంద్రీకృతమై ఉంది అని అందుకే సరైన కథానాయిక కోసం వేణు వెతుకుతున్నాడని సమాచారం.