Year Ender 2023 | సత్తా చాటిన షారుక్, కియారా.. ఆ జాబితాలో ఇండియా నుంచి వీళ్లకు మాత్రమే చోటు!
Year Ender 2023 | ఇక బాలీవుడ్ పనైపోయినట్లే అని అంతా అనుకుంటున్న టైమ్‌లో హిందీ సినీ పరిశ్రమను నిలబెట్టాడు షారుక్‌ఖాన్. పాన్ ఇండియా మూవీస్ పేరుతో దక్షిణాది చిత్రాలు దండయాత్ర కొనసాగుతున్న టైమ్‌లో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్‌కు ఎప్పటికీ తానే బాద్షా అని నిరూపించుకున్నాడు.
Year Ender 2023 | ఇక బాలీవుడ్ పనైపోయినట్లే అని అంతా అనుకుంటున్న టైమ్‌లో హిందీ సినీ పరిశ్రమను నిలబెట్టాడు షారుక్‌ఖాన్. పాన్ ఇండియా మూవీస్ పేరుతో దక్షిణాది చిత్రాలు దండయాత్ర కొనసాగుతున్న టైమ్‌లో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్‌కు ఎప్పటికీ తానే బాద్షా అని నిరూపించుకున్నాడు. ఈ ఏడాదిలో పఠాన్, జవాన్ అంటూ రెండు సినిమాలతో వచ్చి సంచలన విజయాలను సాధించాడు. ఈ సినిమాలకు వచ్చిన హైప్ చూసి.. ఆడియన్స్ కూడా వీటి గురించి గూగుల్‌లో తెగ వెతికేశారు. ఇది ఎంతలా ఉందంటే.. కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయంగా గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జవాన్ సినిమా మూడో స్థానంలో నిలవగా.. పఠాన్ పదో స్థానంలో నిలిచింది. ఇక సన్నీ డియోల్ హీరోగా వచ్చిన గదర్-2 కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ గురించి ఈ ఏడాది అత్యధికంగా వెతికారని గూగుల్ వెల్లడించింది. అంతర్జాతీయంగా నెటిజన్లు అత్యధికంగా వెతికిన నటుల జాబితాలో కియారా తొమ్మిదో స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ మేరకు ఆ జాబితా వివరాలను బయటపెట్టింది.
గ్లోబల్లీ మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్ -2023
1. జెరెమీ రెన్నర్
2. జెన్నా ఒర్టెగా
3. ఇచికవా ఎన్నోసుకే IV
4. డానీ మాస్టర్సన్
5. పెడ్రో పాస్కల్
6. జామీ ఫాక్స్
7. బ్రెండన్ ఫ్రాసర్
8. రస్సెల్ బ్రాండ్
9. కియారా అద్వాణీ
10. మాట్ రిఫె
మోస్ట్ సెర్చ్డ్ మూవీస్
1. బార్బీ
2. ఓపెన్‌హైమర్
3.జవాన్
4. సౌండ్ ఆఫ్ ఫ్రీడమ్
5. జాన్ విక్ : చాప్టర్ 4
6. అవతార్ : ది వే ఆఫ్ వాటర్
7. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
8. గదర్ 2
9. క్రీడ్ III
10. పఠాన్
భారతీయులు అత్యధిక వెతికిన టాప్-10 మూవీస్ ఇవే..
1. జవాన్
2. గదర్-2
3. ఓపెన్‌హైమర్
4. ఆదిపురుష్
5. పఠాన్
6. ది కేరళ స్టోరీ
7. జైలర్
8. లియో
9. టైగర్-3
10. వారిసు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

