Ye Maaya Chesave | టాలీవుడ్ నటులు నాగ చైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఏ మాయ చేశావే. 2010లో విడుదలైన ఈ చిత్రం యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. అలాగే సమంతను హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేసింది. ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ యువతకు ఇష్టమైన ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఈ సినిమా నాటికీ నేటికీ ఒక క్లాసిక్ రొమాంటిక్ చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా వచ్చి 15 ఏండ్లు అవుతున్న సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 18న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే చైతన్య, సమంతల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకుని, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్ అవుతుండటంతో, వారిద్దరూ ప్రమోషన్లలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.