మాజీ దంపతులు నాగచైతన్య, సమంత ‘ఏ మాయ చేసావే’ రీరిలీజ్ ప్రమోషన్స్‌లో కలిసి పాల్గొనబోతున్నారంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. విడాకులు తీసుకొని ఇప్పటికే నాలుగేళ్లు గడచిపోయాయి కాబట్టి వారి మధ్య అంతగా విభేదాలు లేవని మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై సమంతా స్పందించింది. ఆ వార్తలన్నీ పుకార్లేనంటూ కొట్టిపారేసింది.
‘నేను ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనబోవడం లేదు. అసలు ఈ వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదు. ఎవరో కోరుకుంటున్నారని వారి దృష్టికోణం నుంచి నా జీవితాన్ని గడపలేను.’ అని సమంత స్పష్టం చేసింది. అదే సమయంలో నాగచైతన్య ప్రస్తావన ఏమాత్రం లేకుండా సినిమాపై ప్రశంసలు కురిపించింది. ‘ఏ మాయ చేసావే’ చిత్రానికి సంబంధించిన ప్రతీ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకున్నానని, తన కెరీర్లో గొప్ప పాత్ర అదని సంతోషం వ్యక్తం చేసింది.