Yatra-2 Movie | నాలుగేళ్ల కిందట వచ్చిన యాత్ర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి జీవించేశాడు. ఇక అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కాగా ఆ మధ్య ఈ సినిమా సీక్వెల్‌ను ఓ పోస్టర్‌తో అనౌన్స్‌చేశారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ ఓ డైలాగ్‌ను యాడ్ చేసి పోస్టర్‌ను వదిలారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఆ తర్వాత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ఆర్ చెప్పిన మాటలతో వీడియో స్టార్ట్ అయింది. చివర్లో నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్‌తో మోషన్ పోస్టర్‌ను కంప్లీట్ చేశారు. విజువల్స్ మాత్రం వేరే లెవల్లో అనిపించాయి. ఈ సినిమాను ఎలక్షన్స్ కంటే ముందే రిలీజ్ చేయాలని విధంగా ప్లాన్ చేస్తూ అదే స్పీడ్‌తో షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. కాగా తాజాగా జీవా.. జగన్ క్యారెక్టర్లో యాక్టింగ్ చేస్తున్నట్లు వీడియో లీకైంది. జీవా అచ్చం జగన్‌ను దింపేశాడు. జగన్‌లానే దండాలు పెట్టడం. మైక్ పట్టుకోవడం వంటివి వీడియోలో కనిపించాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహి వీ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ సెల్యూలాయిడ్ సంస్థ నిర్మిస్తుంది. ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
#Jiiva – #Yatra2 shooting in full swing pic.twitter.com/QX2MiBkDrP
— Movies4u Official (@Movies4u_Officl) September 24, 2023