KGF Chapter 2 Completed 3 Years | కన్నడ సూపర్‌స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ విడుదలై ఇటీవల మూడేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడమే కాకుండా.. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీకి సంబంధించి హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 3’ గురించి హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఉండబోతుందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఇక వీడియో చివరలో “కేజీఎఫ్ ఛాప్టర్ 3” అనే టైటిల్‌తో పాటు యశ్ రాకీ భాయ్ గొంతుతో “సీ యు సూన్” అనే సందేశం వినిపించడం ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపింది. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై ఓ ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ, కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం నేను ‘టాక్సిక్’ మరియు ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాను. మేము డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఈ సినిమా గురించి చర్చిస్తున్నాం. సరైన సమయంలో భారీగా రాబోతున్నాం అని తెలిపారు.