Yashraj films | రూ.400 కోట్ల ఆఫర్ తిరస్కరించిన ఆదిత్యా చోప్రా..!
నా మహమ్మారి పుణ్యమా అని థియేటర్లలో విడుదలై వినోదాన్ని పంచాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ధాటికి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ఓటీటీ ప్లాట్ ఫాంలలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

కరోనా మహమ్మారి పుణ్యమా అని థియేటర్లలో విడుదలై వినోదాన్ని పంచాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ధాటికి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ఓటీటీ ప్లాట్ ఫాంలలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఇది నిర్మాతలకు లాభదాయకంగా మారినా..థియేటర్లను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చే విషయమే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే, అజయ్ దేవ్ గన్ నటించిన భుజ్..ది ప్రైడ్ ఆఫ్ ఇండియా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుదలయ్యాయి.
ప్రముఖ బాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yashraj films) చేతిలో బంటీ ఔర్ బబ్లీ 2, పృథ్విరాజ్, జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యాచోప్రా (Aditya Chopra)కు పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచే పెద్ద పెద్ద ఆఫర్లే వచ్చాయట. కానీ ఆదిత్యా చోప్రా మాత్రం ఓటీటీ ఆఫర్లను తిరస్కరించినట్టు బీటౌన్ లో వార్త హల్ చల్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ నాలుగు చిత్రాలకు ఏకంగా రూ.400 కోట్లు ఆఫర్ చేసిందట.
ఇంత మొత్తంలో వచ్చిన ఆఫర్ కు ఓకే చెబితే లాభాల పంట పండినట్టే…కానీ ఆదిత్యచోప్రా మాత్రం మహారాష్ట్రలో థియేటర్లు రీఓపెన్ అయిన తర్వాతే ఈ నాలుగు చిత్రాల విడుదల తేదీలను ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నట్టు బీటౌన్ సమాచారం. యశ్ రాజ్ ఫిలింస్ లాంటి అగ్ర సంస్థ థియేటర్ల వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆదిత్యా చోప్రా నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

