టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ నెట్టింట్లో మంచి వ్యూస్ రాబడుతోంది.
ఈ చిత్రాన్ని నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇపుడు ట్రైలర్ అప్ డేట్ వీడియోను షేర్ చేశారు. అక్టోబర్ 27న సాయంత్రం 5.36 గంటలకు ట్రైలర్ లాంఛ్ చేస్తున్నట్టు తెలిపారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న యశోదను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
यशोदा कौन है पता है ना?? 🔥
Unveiling the fiercest, emotional & Action-packed #YashodaTrailer on 27th Oct @ 5.36 PM💥#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff @SanchitaTrivedi pic.twitter.com/pE71VFif95
— Sridevi Movies (@SrideviMovieOff) October 24, 2022
యశోద టీజర్‌పై ఓ లుక్కేయండి మరి..