పోలీస్ పాత్ర నాకు చాలా ప్రత్యేకం
రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన బ్లాక్‌బస్టర్ ‘మర్దానీ’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు 2019లో సీక్వెల్‌గా ‘మర్దానీ 2’ విడుదలైంది. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. ‘మర్దానీ 2’ విడుదలై శుక్రవారానికి అయిదేండ్లు పూర్తయిన సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన మేకింగ్ వీడియోను యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది.
రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన బ్లాక్‌బస్టర్ ‘మర్దానీ’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు 2019లో సీక్వెల్‌గా ‘మర్దానీ 2’ విడుదలైంది. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. ‘మర్దానీ 2’ విడుదలై శుక్రవారానికి అయిదేండ్లు పూర్తయిన సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన మేకింగ్ వీడియోను యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో రాణి ముఖర్జీ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీరాయ్ పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ‘మర్దానీ-3’ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాం. పోలీస్ డ్రెస్ వేసుకొని అద్భుతమైన పాత్ర చేయడం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఆ పాత్ర ద్వారా మీనుంచి అమితమైన అభిమానాన్ని పొందాను. సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ, బాధ్యతానిర్వహణలో ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని పోలీసులకు ఈ సినిమా అంకితం. గత ఫ్రాంచైజీని మించేలా గూజ్బమ్స్ తెప్పించేలా అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతున్నది.’ అని తెలిపారు. అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రచన: ఆయుష్ గుప్తా, నిర్మాత: ఆదిత్య చోప్రా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

