NTR |ఈ మధ్య టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. ఏదైన హీరో బర్త్ డే వస్తుందంటే చాలు సెలబ్రేషన్స్‌తో పాటు సదరు హీరో సూపర్ సినిమాలని రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నారు.మరి కొద్ది రోజులలో ఎన్టీఆర్ బర్త్ డే రానుండగా, ఈ సందర్భంగా ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారట. 2007లో విడుదలైన సోషియో ఫాంటసీ చిత్రంలో మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీ సింహా నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్.టి.ఆర్. మానవుడిగా అదరగొట్టేశారు. ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్.
ఎన్టీఆర్ బర్త్ డే మేం 20న కాగా,ఈ సందర్భంగా ‘యమదొంగ’ సినిమాను మే 18వ తేదీన రీరిలీజ్ చేస్తున్నారు.. ఆ రోజుతో పాటు 19, 20వ తేదీలలో కూడా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. యమదొంగ’గా ఎన్టీఆర్ హంగామా థియేటర్లలో ఆ మూడు రోజులే ఉంటుంది అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రేక్షకుల ఆదరణని బట్టి ఈ మూవీని కంటిన్యూ చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు.. ఈ విషయాన్ని మైత్రీమూవీస్ నిర్మాణ సంస్థ తెలియజేసింది. మైత్రీ అధినేత చెర్రి, ఊర్మిళ నిర్మాతలుకాగా, రమా రాజమౌళి సమర్పణలో ఈ చిత్రం రూపొందింది.
యుముడి పాత్రలో మోహన్ బాబు చేస్తేనే సినిమా చేయగలనంటూ రాజమౌళి పట్టుబట్టాడు.యముడుకి, ఎన్.టి.ఆర్.కు మధ్య యమలోకంలో సాగే డైలాగ్ లు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తుంటాయి.భవిష్యత్తులో కూడా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ‘యమదొంగ’ సినిమా ప్రింట్ 8కేలో రీస్టోర్ చేశారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 4కేలో స్పెషల్ షోస్ వేయడానికి రెడీ అయ్యారు. ఏపీ, తెలంగాణ… ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది. కొత్త వర్షెన్‌లో విడుదల కానున్న యమదొంగ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.