లాస్ ఏంజిల్స్: ఆస్కార్స్ అకాడమీ ఈ యేటి అవార్డులకు చెందిన షార్ట్‌లిస్టును ప్రకటించింది. షార్ట్‌లిస్టు కోసం డిసెంబర్ 15వ తేదీన ఓటింగ్ నిర్వహించారు. అయితే బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరీలో ఇండియా నుంచి రైటింగ్ విత్ ఫైర్ నామినేట్ అయ్యింది. రింటూ థామస్ దీన్ని రూపొందించారు. అయితే ఆస్కార్స్ రేసు నుంచి కూజంగల్ ఔట్ అయ్యింది. రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంటరీని రింటూ థామస్, సుష్మితా ఘోష్ తీశారు. దళిత మహిళ ఓ పత్రికను నడపడమే ఆ డాక్యుమెంటరీలో మూల కథ. వచ్చ ఏడాది ఫిబ్రవరిలో 94వ ఆస్కార్స్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రైటింగ్ విత్ ఫైర్‌ను రింటూ థామస్ డైరక్ట్ చేశారు. సుష్మితా ఘోష్ కూడా డైరక్షన్ టీమ్‌లో ఉన్నారు. దళిత మహిళ నడిపిన ఖబర్ లహరియా కథ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తీశారు. ఈ క్యాటగిరీలో మొత్తం 139 సినిమాలు పోటీపడ్డాయి. అయితే ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఆస్కార్స్‌కు వెళ్లిన కూజగల్ రేస్ నుంచి తప్పుకున్నది.
#WritingWithFire is on the @TheAcademy Shortlist. What a moment for my entire team behind this indie Indian doc. What a moment for the Indian documentary community. We are richer with the stories we choose to tell, big love @KhabarLahariya 💜💜 https://t.co/CLHSqF3Gxn pic.twitter.com/CRPIej1k4R
— Rintu Thomas (@RintuThomas11) December 22, 2021