Saiyaaara Movie | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు సృష్టించిన చిత్రం సైయారా (Saiyaara). ఈ చిత్రం ఇండియాతో పాటు వరల్డ్ వైడ్గా సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం రూ. 400 కోట్ల వసూళ్లను రాబట్టి విజయవంతంగా దూసుకెళుతుంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించగా.. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా కథ కొరియన్ మూవీ ‘ఎ మూమెంట్ టు రిమెంబర్’ (A Moment to Remember) కు కాపీ అంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై రచయిత సంకల్ప్ సదానా (Sankalp Sadanah) స్పందించారు.
సదానా మాట్లాడుతూ.. సైయారా ఒరిజినల్ కథ అని.. ఈ సినిమాను నా సోంత ఆలోచనలతో రాసుకున్నానని ఎక్కడా కాపీ చేయలేదంటూ తెలిపాడు. ఈ విషయం ఇప్పటికే పలు సార్లు చెప్పాను. అయినా కూడా మీకు ఇంకా అనుమానాలు ఉంటే రెండు సినిమాలు చూస్తే మీకే అర్థమవుతుంది. దర్శకుడు మోహిత్ సూరీతో (Mohit Suri) నేను ‘ఆషికీ 3’ కోసం చర్చలు జరిపాను. ఈ సమయంలోనే నాకు సైయారా ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కథను డెవలప్ చేశానంటూ సదానా చెప్పుకోచ్చాడు.