Amrutham Soap opera | ‘ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు’.. ఈ లిరిక్ వింటుంటేనే తెలుస్తుంది కదా.! ఇది అమృతం సీరియల్ (Amrutham Soap opera) టైటిల్ సాంగ్ అని. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ సీరియల్. అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో.. ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా.. అంటూ పాట మొదలైంటే ప్రేక్షకులు మదిలో చిరునవ్వులు మొదలయ్యేవి. ఆంజనేయులు ఐడియాలు.. అమృత రావు అమాయకత్వం.. అప్పాజీ పెనాల్టీలు.. సర్వం అరవ భాష ఇలా ఒక్కొక్కటి యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సండే వస్తుంది అంటే చాలు అప్పట్లో చిన్నపిల్లలతో పాటు పెద్దలు జెమిని టీవీకి అతుక్కుపోయేవారంటే.. అంతగా జనాలను ఇంపాక్ట్ చేసింది అమృతం సీరియల్. అయితే ఈ సీరియల్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు హర్షవర్థన్.
హర్షవర్థన్.. ఈ సీరియల్లో అమృతం పాత్రలో అలరించిన విషయం తెలిసిందే. తన అమాయకత్వంతో అతడు చేసే పనులకు మంచి మర్కులు సంపాదించాడు. అయితే సీరియల్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమృతం మహిళ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని తెలిపాడు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. నాకు ఎదురైన అనుభవం గురించి చెబుతున్నా… యూత్‌లో బాగా నచ్చిన ఈ సీరియల్ మిడిల్ ఏజ్డ్ వుమెన్స్‌కి మాత్రం అసలు నచ్చలేదు. ఈ విషయం నాకు తెలిసిన వాళ్లు కూడా చెప్పారు అంటూ హర్షవర్థన్ చెప్పుకోచ్చాడు.
Shocking Statement 😳🤯
Women Audience never liked #Amrutham Serial – Harsha Vardhan pic.twitter.com/It4Nx4oGXW
— Telugu Chitraalu (@TeluguChitraalu) December 30, 2024