Rajinikanth – RAm Gopal Varma | తన మాటలతో ఎప్పుడు వివాదంలో చిక్కుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నోటి దురుసుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఆర్జీవీ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం శారీ. యథార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తుంది. వర్మ ఈ సినిమాకు కథను అందించగా.. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు వర్మ.
ఇందులో భాగంగా ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గోన్న వర్మ తమిళ నటుడు రజినీకాంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటన అనేది సినిమాలోని ఆ పాత్రకు సంబంధించిన విషయం. సినిమాలో నువ్వు ఎలా నటిస్తున్నావు అనే దాన్ని బట్టి ఎవరైన స్టార్ అవుతారు. రజినీకాంత్ మంచి నటుడా అని అడిగితే నాకు తెలియదు. ఎందుకంటే రజినీ సత్య లాంటి సినిమాలో బీకు మాత్రే అనే పాత్రను పోషించలేడు. ఆయనను ఇలాగే చూడాలని అందరూ అనుకుంటారు. అసలు స్లో మోషన్ అనేది లేకపోతే రజినీకాంత్ అనే స్టార్ పుట్టకపోయి ఉండవచ్చు. ఆయన సినిమాలో అసలు ఏం చేయకుండా కేవలం స్లో మోషన్లో నడిచినా అది చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు అంటూ వర్మ చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Without slow motion @rajinikanth cannot exist- Director Ram Gopal Varma 😂👌 pic.twitter.com/BcuyyRg2YD
— Bala (@kuruvibala) February 12, 2025