అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘విత్ లవ్’. మదన్ దర్శకుడు. సౌందర్య రజనీకాంత్, నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ నిర్మాతలు. ఫిబ్రవరి 6న సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. చూస్తున్నప్పుడు ఇది మన కథే అనిపించే సినిమా ఇదని అతిథిగా విచ్చేసిన దగ్గుబాటి రానా అన్నారు. భావోద్వేగాలతో కూడుకున్న ప్రయాణం ఈ సినిమా అని, జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఉంటుందని, చాలా క్యూట్ సినిమా అని హీరోహీరోయిన్లు అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నిర్మాతలు సౌందర్య రజనీకాంత్, మహేష్రాజ్ అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయస్ కృష్ణ, సంగీతం: సీన్ రోల్డన్, నిర్మాణం: ఎం.ఆర్.పి.ఎంటర్టైన్మెంట్స్.