Kalki 2898 AD | ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’ . ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే నేడు దిశా పటానీ పుట్టినరోజు ఈ సందర్భంగా మేకర్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ దిశా పటానీ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో దిశా రోక్సి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Wishing our Roxie, @DishPatani a very Happy Birthday.#Kalki2898AD pic.twitter.com/P4IyiK2kIt
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 13, 2024