బాలీవుడ్ ఖాన్ స్టార్ షారుక్‌ఖాన్ మరో దక్షిణాది దర్శకుడుతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ‘నారదన్’, ‘వైరస్’, ‘మాయానది’ లాంటి చిత్రాలతో మలయాళంలో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆషిక్ అబూ. ఈ దర్శకుడితో షారుక్ ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. థ్రిల్లర్ కథతో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న సినిమాకు ఓకే చెప్పారు షారుక్.