బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అమీర్‌ఖాన్ గత కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నారు. భారీ విజయంతో తిరిగి ఫామ్‌లోకి రావాలనే లక్ష్యంతో ఉన్న ఆయన కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అమీర్‌ఖాన్ ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనుందని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. అమీర్‌ఖాన్ గత చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆయన అమీర్‌ఖాన్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అమీర్‌ఖాన్-లోకేష్ కనకరాజ్ కాంబో కార్యరూపం దాల్చితే ఇండియన్ స్క్రీన్‌పై మరో బిగ్గెస్ట్ ఫిల్మ్‌కు రంగం సిద్ధమైనట్లేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.