ప్రభుదేవా, లారెన్స్ రేంజ్లో ఆ కొరియోగ్రఫర్ సక్సెస్ అవుతాడా..?
సౌత్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్‌కు చాలా మంచి క్రేజ్ ఉంది. అదిరిపోయే స్టెప్స్ వేయిస్తూ థియేటర్లో అభిమానులు చిందులు వేసేలా పాటను కొరియోగ్రఫీ చేస్తాడు.

కొరియోగ్రాఫర్‌గా వచ్చి నటులుగా మారి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రభుదేవా, లారెన్స్. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా, డైరెక్టర్‌గా తమ కంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్నారు. లారెన్స్ ఇప్పటికీ హీరోగా చాలా బిజీ. ఈయన కెరీర్లో మంచి మంచి విజయాలు కూడా ఉన్నాయి. ప్రభుదేవా కూడా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి దారిలో మరో కొరియోగ్రాఫర్ కూడా అడుగులు వేస్తున్నాడు. ఆయనే జానీ మాస్టర్.
తెలుగు ఇండస్ట్రీతో పాటు హిందీ, తమిళం, కన్నడలో కూడా ఈయన చాలా పాటలకు స్టెప్స్ కంపోజ్ చేశాడు జానీ మాస్టర్. సౌత్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్‌కు చాలా మంచి క్రేజ్ ఉంది. అదిరిపోయే స్టెప్స్ వేయిస్తూ థియేటర్లో అభిమానులు చిందులు వేసేలా పాటను కొరియోగ్రఫీ చేస్తాడు జానీ మాస్టర్. ఈయన కొరియోగ్రఫీ చేసిన రౌడీ బేబీ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు బుట్టబొమ్మ అలాంటి సంచలనం క్రియేట్ చేసింది. మొన్నటికి మొన్న హిందీలో సల్మాన్ ఖాన్‌తో సీటిమార్ స్టెప్పులు వేయించాడు జానీ మాస్టర్. ఇప్పుడు ఈయన నటుడిగా మారుతున్నాడు.

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే రెండు సినిమాలు లైన్లో పెట్టాడు జానీ మాస్టర్. ఇప్పటికే J1 పేరుతో ఒక సినిమాను మొదలు పెట్టాడు జానీ. మరోవైపు దక్షిణ అనే మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు జానీ. మంత్ర సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న ఓషో తులసి రామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ రెండు సినిమాలతో నటుడిగా బిజీ ఇవ్వాలని చూస్తున్నాడు జానీ మాస్టర్. అయితే కొరియోగ్రాఫర్స్ అందరూ హీరోలుగా సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అమ్మ రాజశేఖర్, ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం లాంటి వాళ్లంతా హీరోలుగా చేసి డిజాస్టర్స్ అందుకున్నారు. మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఏ కేటగిరిలోకి వెళ్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అమీర్‌ఖాన్ దంపతుల 15 ఏండ్ల వివాహ బంధానికి తెర
ముఖ్యమంత్రి కొడుకుతో ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి
మెహ్రీన్ కౌర్ కంటే ముందు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
కాజల్ గర్భవతా, ఇందులో నిజమెంత?
చిన్మయి గర్భవతి అంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫేమస్ సింగర్
ప్రగ్యాని రౌండప్ చేసిన బిచ్చగాళ్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

