కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ కాస్త లేట్ వయస్సులో లేటెస్ట్ పెళ్లి పీటలెక్కింది. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అతనితో సంతోషకరమైన జీవితం గడుపుతుంది. పెళ్లి తర్వాత తన తొలి బర్త్‌డే వేడకని ఇటీవల జరుపుకోగా, ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వచాయి. అయితే కాజల్ సోదరి నిషా.. త్వరలో కాజల్ తల్లి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు నా మూడేళ్ల కొడుకుతో ఆడుకోవడానికి ఒకరు తోడుంటారు అని పేర్కొంది.
కాజల్ పోస్ట్‌తో అందరితో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. బహుశా కాజల్ గర్భవతి అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ వార్త జోరుగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కాజల్ సన్నిహితులు అవన్నీ పుకార్లు అని కొట్టి పారేశారు. ప్రస్తుతం కాజల్ ఆచార్య చిత్రంతో పాటు ఇండియన్ 2, ఉమ, నాగ్ చిత్రంతో బిజీగా ఉంది.