Ajith – Lokesh Kanagaraj | తమిళ అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రజినీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్‌ల తర్వాత త్వరలోనే స్టార్ నటుడు అజిత్‌తో కూడా సినిమా చేయబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. తన తాజా చిత్రం ‘కూలీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ మాట్లాడుతూ, “అజిత్ సర్‌తో కచ్చితంగా సినిమా చేస్తాను. దాదాపు పది నెలల క్రితం ఆయన మేనేజర్ సురేశ్ చంద్ర సార్ ద్వారా అజిత్‌తో ఒక సినిమా గురించి చర్చించాను. నా శైలిలో ఒక యాక్షన్ సినిమాను ఆయనతో చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను” అని తెలిపారు. ప్రస్తుతం అజిత్ సర్ కార్ రేసింగ్‌లతో బిజీగా ఉన్నారని, సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తామిద్దరం కలిసి పని చేస్తామని లోకేష్ కనగరాజ్ ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ కనగరాజ్ శైలిలో అజిత్ యాక్షన్ సినిమా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రకటన అజిత్, లోకేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
“100% i will do a film with #Ajithkumar sir💯. I discussed a film with him before 10 months via SureshChandra sir🎬. I want explore my style of Action film with him🔥. He is busy with Racing now, we will collaborate when right time comes♥️”
– #Lokesh pic.twitter.com/bh4mCMroQV— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2025