Prabhas – Sandeep Reddy Vanga | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit). దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై చాలా అనుమానాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ జోడీగా మృణల్ థాకుర్తో పాటు కియార అద్వానీ, త్రిష అనే పేర్లు వినిపించాయి. అయితే ఇవి కాకుండా తాజాగా మరో పేరు వినిపిస్తుంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం దీపికా పదుకొణే ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో దీపికా ఒక గృహిణి() పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ మూడు కొత్త లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా తరహాలో ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది.