Samantha | నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తీరు పూర్తిగా మారిపోయింది. ఆమె కొత్తగా కనిపిస్తోంది. ముందులా కాకుండా చాలా పద్ధతులు మార్చుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయింది. ఆలయాల చుట్టూ తిరుగుతూ భక్తిభావాన్ని చూపిస్తుంది. ఇంతకు ముందు ఫ్యాన్స్ ఎప్పుడూ సమంతను అలా చూడలేదు. తనలో తనకే తెలియని ఒక కొత్త కోణం ప్రేక్షకులకు పరిచయం చేసే పనిలో బిజీగా ఉంది మాజీ అక్కినేని కోడలు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ కూడా బుక్ చేసుకుని మరి చార్ధామ్ యాత్రకు వెళ్లొచ్చింది. దీంతో ఉన్నట్టుండి సమంత తీర్థయాత్ర లు ఎందుకు చేస్తుంది.. దాని వెనుక ఉన్న కారణాలేంటి అని అంతా ఆలోచిస్తున్నారు.
నిజానికి సమంత తీర్థయాత్ర వెనుక పెద్ద కారణాలు ఏమీ లేవు. నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంత అన్యమనస్కంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్లు కనిపిస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. షూటింగ్‌కి వెళ్లినా కూడా అక్కడ లొకేషన్లో ఒంటరిగా కూర్చొని ఉంటుందని.. ఎవరితో మాట్లాడటం లేదని తెలుస్తోంది. నాగచైతన్యను పిచ్చిగా ప్రేమించిన సమంత.. అతడితో విడిపోయిన తర్వాత అంత ఈజీగా సెట్ కావడం లేదని సమాచారం. కేవలం ఈ కారణంతోనే మానసిక ప్రశాంతత కోసం దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంది సమంత. రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనతోనే గడపాలని చూస్తుంది.
నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఎక్కువగా గోవా సహా పలు టూరిస్ట్ లొకేషన్లలో ఎంజాయ్ చేసొసిచ్చిన సమంత.. ఇప్పుడు మాత్రం దైవ చింతనలో మునిగిపోయింది. మరికొన్ని రోజులు ఇలాగే ఆధ్యాత్మికతతోనే గడిపేయాలని ఫిక్సయింది. మరీ ముఖ్యంగా మనసు కుదుటపడేంత వరకు అవసరమైతే సినిమాలకు కూడా దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేసి ఆ తర్వాత కొత్త సినిమాల కోసం టైం తీసుకోబోతుంది మాజీ అక్కినేని కోడలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
విడాకుల తర్వాత భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న సమంత.. కల నెరవేరిందంటూ వేదాంతం
Samantha : సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
Samantha : నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..