Abhishek Sharma: అభిషేక్ శర్మకు జరిమానా.. మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్
Abhishek Sharma: హైదరాబాదీ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఫైన్ పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిన ఘటనలో అతనికి ఓ డీమెరిట్ పాయింట్ కూడా వచ్చింది. మ్యాచ్ ఫీజులో అతనికి 25 శాతం జరిమానా విధించారు.
కోల్‌కతా: ఐపీఎల్లో కోల్‌కతాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు సూపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 65 రన్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం నమోదు చేసింది. అయితే హైదరాబాదీ బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఈ మ్యాచ్‌లో ఫైన్ పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిన ఘటనలో అతనికి ఓ డీమెరిట్ పాయింట్ కూడా వచ్చింది. మ్యాచ్ ఫీజులో అతనికి 25 శాతం జరిమానా విధించారు. ఆర్టికల్ 2.3 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను ఆమోదించాడు. ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 ఉల్లంఘనలకు పాల్పడితే, మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 21 బంతుల్లో 48 రన్స్ చేశాడు. భారీ స్ట్రోక్స్‌తో అలరించాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ముజర్బానీ బౌలింగ్‌లో భారీ హుక్ షాట్‌కు ప్రయత్నించాడు అభిషేక్. అయితే అతను కొట్టిన బంతిని వరుణ్ చక్రవర్తి డీప్‌లో అందుకున్నాడు. ఆ క్యాచ్‌పై థార్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీవీ అంపర్ నితిన్ మీనన్ ఇచ్చిన నిర్ణయంపై అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. టీవీ అంపైర్‌ను అభిషేక్ తప్పుపట్టాడు. ఈ ఘటనలో ఐపీఎల్ చర్యలు తీసుకున్నది. హైదరాబాదీ ప్లేయర్‌కు జరిమానా విధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Abhishek Sharma
- fined
- ipl 2026
- KKR
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

