రాజేంద్ర ప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడు..?

rajendra prasad son Balaji prasad | ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వారసులు లేక బాధ పడుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్లకు అబ్బాయిలు లేరు. వాళ్ల అమ్మాయిలే వారసత్వం నిలబెడుతున్నారు. అలాంటిది వారసుడు ఉండి కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్. ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానం ఉండి.. స్టార్ హీరోగా చక్రం తిప్పిన రాజేంద్ర ప్రసాద్ తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాడు. కొండంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా ఎందుకు తన వారసుడిని హీరో చేయలేకపోయాడు అని ఆయన అభిమానుల్లో ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది. దాని వెనుక ఒక పెద్ద కథ కూడా ఉంది. అందరి హీరోల మాదిరే తన వారసుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ చాలా ఆశ పడ్డాడు. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.
అంతేకాదు బాలాజీ ప్రసాద్ చూడటానికి ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్ లాగే ఉంటాడు. దాంతో కొడుకును హీరోగా పరిచయం చేయాలంటూ రాజేంద్రుడిని చాలామంది అడిగారు కూడా. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత రాఘవేంద్రరావు చేతిలో పెట్టాడు రాజేంద్ర ప్రసాద్. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అందరూ దొంగలే ఇలాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నాడు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. చాలా రోజుల పాటు ఆగిపోవడంతో బాలాజీ ప్రసాద్ కు సినిమాలపై విరక్తి వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలున్నాయి.
తొలి సినిమా విషయంలోనే ఇన్ని కష్టాలు ఎదురుకావడంతో ఆయన తట్టుకోలేకపోయాడని.. నటన అంటేనే విసుగు తెచ్చుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ ఎంత ఒప్పించాలని చూసినా కూడా తండ్రి మాటను బాలాజీ ప్రసాద్ వినలేదు. ఆ తర్వాత అసలు సినిమాల వైపు చూడలేదు. కావాలంటే నిర్మాతలను తాను తీసుకొస్తానని చెప్పినా కూడా వినలేదంట. అయినా మాట వినకపోవడంతో తానే నిర్మాతగా మారి సినిమా చేస్తానని చెప్పినా కూడా బాలాజీ ప్రసాద్ వినలేదని తెలుస్తోంది. ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో కొడుకును తన ఇష్టానికి వదిలేశాడు రాజేంద్రుడు. ప్రస్తుతం ఈయన తనకు ఇష్టమైన విదేశాలకి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే జీవితంలో ఎంత సాధించినా కూడా కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాననే బాధ మాత్రం నటకిరీటి మనసులో అలాగే ఉండిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mallika Sherawat | తండ్రి పేరు చెప్పని మల్లికాశెరావత్..కారణమిదే..!
మెగాస్టార్ చిరంజీవి డాన్సులను విమర్శించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?
Prabhas | ప్రభాస్‌తో గొడవపడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
మేము ఐదుగురం కాదు.. ఎనిమిది మంది.. మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
Paddy Procurement | ఎక్కడి ధాన్యం అక్కడే.. వడ్ల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు కాస్తున్న రైతన్నలు
Revanth Reddy | కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
Horoscope | 11-11-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

