Radhe shyam | సంక్రాంతికి తమ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎంతోమంది అనుకుంటుంటారు. ఈ సారి కూడా అలాగే చాలామంది పెద్ద నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా అంతా బెడిసికొట్టింది. కొవిడ్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు సంక్రాంతికి రావడంతో ముందు నుంచి అనుకున్న భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వంటి బడా సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకున్నారు నిర్మాతలు. ఇక ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలతో సినీ అభిమానులకు ఈ సంక్రాంతి పండుగలా మారుతుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కరోనా మళ్లీ అడ్డుపడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ముంబై, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని విధించారు. దీంతో చివరి నిమిషంలో ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా పడింది. కానీ రాధే శ్యామ్ సినిమాను మాత్రం అనుకున్న టైమ్‌కే తీసుకొస్తామని అంటున్నారు దర్శక నిర్మాతలు.
బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి గ్రాండియర్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జనవరి 7న రావాల్సిన ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలో రాధేశ్యామ్ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని దర్శక నిర్మాతలు మరోసారి కన్ఫామ్ చేశారు. అనుకున్న టైమ్‌కే సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నారు. కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ విధించడం.. ఏపీలో టికెట్ రేట్లు.. వీటన్నింటినీ తట్టుకుని రాధేశ్యామ్ సినిమాకు కలెక్షన్స్ ఎంత వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో ఒక పాన్ ఇండియా సినిమా విడుదలైన కచ్చితంగా కలెక్షన్స్‌పై దారుణమైన ప్రభావం చూపిస్తుంది. దీంతో అసలు వీళ్ల ధైర్యం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే దీని వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను ముందుకు థియేటర్లలో విడుదల చేసి.. చాలా తక్కువ వ్యవధిలో ఓటీటీకి ఇచ్చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దానికోసం వాళ్లు భారీగా రేటు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే కానీ సినిమా బిజినెస్ వర్క్అవుట్ అవ్వదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda | ఇప్పటికే ఓటిటిలో రావాల్సిన ‘అఖండ’ ఇంకా ఎందుకు రాలేదు..?
Radha Krishna Kumar | రాధేశ్యామ్ వాయిదా..? డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ ట్వీట్
RRR వాయిదాతో లాభపడ్డ సినిమాలేవి.. సంక్రాంతికి ఎవరు వస్తున్నారు..?
సంక్రాంతికి ఏంటి సినీ జాతర.. బరిలో దిగిన 8 సినిమాలు..