సంక్రాంతికి ఏంటి సినీ జాతర.. బరిలో దిగిన 8 సినిమాలు..

Sankranti movies | మొన్నటి వరకు సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నాయి అంటే ముందు ట్రిపుల్ ఆర్.. ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా పేర్లు వినిపించాయి. ఆ తర్వాత నాగార్జున బంగార్రాజు సినిమా కూడా డౌట్‌గానే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా వైరస్ కారణంగా మరోసారి థియేటర్లు మూతపడటం.. 50 శాతం ఆక్యుపెన్సీ ఉండాలంటూ ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో పెద్ద సినిమాలన్నీ ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయాయి. దాంతో చాలా రోజులుగా విడుదల కోసం వేచి చూస్తున్న చిన్న సినిమాలు రెక్కలు విప్పుకొని థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నాయి.
సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడం లేదు అన్న విషయం తెలిసిన తర్వాత.. ఒకటి రెండు కాదు ఏకంగా ఒకే రోజు ఎనిమిది సినిమాల నిర్మాతలు విడుదల తేదీలను కన్ఫార్మ్ చేశారు. అన్ని సంక్రాంతికే వస్తున్నట్లు పోస్టర్స్ విడుదల చేశారు. అందులో నాగార్జున బంగార్రాజు ఎలాగూ ఉంది. మరోవైపు మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా హీరో జనవరి 15న విడుదల కానుంది. దానికి ఒకరోజు ముందు సిగ్గు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న డీజే టిల్లు విడుదలవుతుంది. ట్రిపుల్ ఆర్ విడుదల కావాల్సిన జనవరి 7న ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న అతిథి దేవోభవ వస్తోంది. వీటితో పాటు రాజశేఖర్ శేఖర్.. ఎమ్మెస్ రాజు 7 డేస్ 6 నైట్స్.. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న సూపర్ మచ్చి.. దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న రౌడీ బాయ్స్.. ఇలా ఒకేసారి 8 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి ఇందులో ఎన్ని సినిమాలకు ప్రేక్షకులు ఓటేస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

