Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Jailer 2 Hindi Version | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Jailer 2 Hindi Version | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా హిందీ వెర్షన్ ఉత్తరాదిలో కొన్ని చోట్ల ప్రదర్శనకు నోచుకోవడం లేదు. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లైన పీవీఆర్-ఐనాక్స్, సినీపోలిస్‌లలో ఈ చిత్ర హిందీ వెర్షన్ విడుదల కాకపోవడానికి ఓటీటీ వివాదమే ప్రధాన కారణమని తెలుస్తుంది.
సినిమా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ స్ట్రీమింగ్కు మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని ఈ మల్టీప్లెక్స్ సంస్థలు పట్టుబడుతున్నాయి. అయితే, నిర్మాత సన్ పిక్చర్స్, డిస్ట్రిబ్యూటర్ పెన్ మరుధర్ ఎంటర్టైన్మెంట్ మాత్రం అన్ని భాషలకు కేవలం నాలుగు వారాల విండో మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాయి. ఈ వాగ్వాదం కారణంగానే ఒప్పందాలపై సందిగ్ధత నెలకొని, ఉత్తరాదిలోని పీవీఆర్-ఐనాక్స్ మరియు సినీపోలిస్‌లలో హిందీ వెర్షన్ ప్రదర్శనలను రద్దు చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ వివాదం కేవలం హిందీ వెర్షన్‌కే పరిమితం కాగా, నవంబర్ నెలలో దీపావళి కానుకగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని భాషల్లో ఓటీటీ ప్రీమియర్ కానుందని సమాచారం. ఉత్తరాదిలో ఈ మల్టీప్లెక్స్ చైన్లు కాకుండా కేవలం సింగిల్ స్క్రీన్లు, ఇతర స్టాండర్డ్ థియేటర్లలో మాత్రమే హిందీ వెర్షన్ ప్రదర్శితం కానుంది. ఈ భారీ చిత్రంలో హృతిక్ రోషన్, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

