Megastar Chijranjeevi Line Up | మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. తన నటనతో అంచలంచలుగా ఎదిగి తెలుగులో నెం1 హీరో అయ్యాడు. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓటమి పాలయ్యాడు. ఇక రాజకీయ జీవితం నుంచి బయటకు వచ్చిన చిరు సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ(Chiru Re Entry) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖైదీ 150(Khaidi 150) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు. అనంతరం ‘సైరా నరసింహరెడ్డి’, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళ శంకర్ సినిమాలతో అలరించాడు. అయితే ఈ సినిమాలలో కొన్ని విజయం అందుకున్న కూడా మెగా ఫ్యాన్స్ అనుకున్నంతా రేంజ్లో హిట్టు అవ్వకపోవడం.. చిరంజీవికి సరైన మూవీ పడకపోవడం అభిమానులకు తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే చిరుకి ఒక సాలిడ్ ఎప్పుడు పడుతుందా.. మా ఆకలి ఎప్పుడు తీరుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా కుర్ర దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు.
ఇప్పటికే యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నా బాస్ ఈ చిత్రం అనంతరం క్రేజీ లైనప్‌ను లైన్లో పెట్టాడు. ఇందులో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో పాటు సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravi Pudi)తో సినిమాలు చేయబోతున్నాడు చిరు. ఈ ఇద్దరే కాకుండా లక్కీ భాస్కర్‌తో హిట్ అందుకున్న వెంకీ అట్లూరితో కూడా చిరు సినిమా చేయబోతున్నాడు. ఈ ముగ్గురిలో చిరు అభిమానుల ఆకలి తీర్చేది ఎవరని ఇప్పటినుంచే ఆన్లైన్లో చర్చలు జరుగుతున్నాయి. కొందరూ ఏమో మాస్ ఉచకోత లాంటి సినిమా తీస్తాడని శ్రీకాంత్ ఓదెల మీద నమ్మకం పెట్టుకోగా.. మరికొందరూ.. అనిల్ రావిపూడితో యాక్షన్ & కామెడీ ఎంటర్టైనర్తో ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తాడని అనుకుంటున్నారు. కాగా దీనిపై క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.