Chiranjeevi Next Movie | ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’ వంటి కమర్షియల్ ఫేయిల్యూర్స్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు చిరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది. రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి చిరుకు తిరుగులేని విజయాన్నిందించింది. ప్రస్తుతం చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలే క్రియేట్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో సినిమా చేస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు.
భోళాశంకర్ మరో రెండు నెలల్లో పూర్తయ్యే చాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు చిరు తన తదుపరి సినిమా ఏంటి అనేది చెప్పలేదు. అయితే చిరు కోసం దాదాపు అరడజను మంది లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా వెంకీ కుడుములతో సినిమా అనుకున్న చిరు.. స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి చెందక దాన్ని హోల్డ్‌లో పెట్టాడు. ఈ లోపు వెంకీ.. నితిన్‌తో రెండో సినిమా మొదలుపెట్టాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయినట్లే తెలుస్తుంది. కాగా ఇప్పుడు చిరు కోసం ఆరుగురు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
సినిమా చూపిస్త మామ, నేను లోకల్, ధమాకా వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన ప్రసన్న కుమార్ బెజవాడు చిరు కోసం మూడు కథలను సిద్ధం చేశాడట. అందులో చిరుకు ఏది నచ్చితే అది ఇచ్చేస్తాడట. ఇక చిరుకు నచ్చిన దర్శకుడికి ఆ కథ ఇచ్చి దర్శకత్వ భాద్యతలు తీసుకోమంటాడట. ఇక థాంక్యూ సినిమాతో చేతులు కాల్చుకున్న మరో రైటర్ బీవీఎస్ రవి చిరు కోసం ఓ మంచి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వంటి సినిమాలతో అక్కినేని ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టిన కళ్యాణ్ కృష్ణ కురసాల కూడా చిరు కోసం ప్రయత్నాలు జరుపుతున్నాడట.
ఇప్పటికే సీనియర్ డైరెక్టర్లు పూరి జగన్నాధ్, వి. వి వినాయక్‌లు చిరు కోసం కథలను సిద్ధం చేశారట. ఇటీవలే బింబిసారతో తిరుగులేని డెబ్యూ ఇచ్చిన మల్లిడి వశిష్ట సైతం చిరు కోసం ఎదురు కాపులు కాస్తున్నాడట. మరి ఈ అరడజను మందిలో చిరును ఎవరు మెప్పిస్తారో చూడాలి. ఇక చిరు ప్రస్తుతం నటిస్తున్న భోళా శంకర్ షూటింగ్ చివరిలో ఉంది. కీర్తి సురేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా తమన్నా హీరోయిన్గా నటిస్తుంది.