Sara Arjun | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar). ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రణ్వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. గత ఆదివారం అతడి పుట్టినరోజు సందర్భంగా ‘ధురంధర్’ (Dhurandhar) ఫస్ట్ లుక్ పేరిటా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్లో హీరోయిన్గా నటిస్తున్న అమ్మాయి వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు. విక్రమ్ నటించిన నాన్న సినిమాతో బాల నటిగా అందరిని మెప్పించిన నటి సారా అర్జున్. అవును సారా అర్జున్ ‘ధురంధర్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
నాన్న సినిమాతో బాలనటిగా మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఏకంగా మణిరత్నం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వన్ చిత్రంలో జూనియర్ ఐశ్వర్య రాయ్ పాత్ర(నందిని)లో మెరిసింది. ఉన్నది కొద్దిసేపే అయిన తన నటనతో ఆకట్టుకుంది. అయితే చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్లో ట్రెండింగ్‌గా మారింది. ప్రస్తుతం సారా అర్జున్ ఎవరని బాలీవుడ్ మీడియాతో పాటు అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీనికి కారణం రణ్వీర్ సింగ్ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్గా నటించడమే. మరోవైపు ఈ సినిమా వలన సారాకి మరిన్ని ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి.
పాపులర్ బాలీవుడ్ యాక్టర్ రాజ్ అర్జున్ కూతురే ఈ సారా. తెలుగులో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన దాగుడు మూత దండాకోర్ చిత్రంలో కూడా నటించింది ఈ భామ.