Vijay Sethupathi | కథను నమ్మి సినిమా చేసే పాన్ ఇండియా స్టేటస్ ఉన్న హీరోల్లో ఒకరు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం మహారాజా. మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఇందులో విజయ్‌సేతుపతి కేకే నగర్లో సెలూనే షాప్ నిర్వహించే వ్యక్తిగా కనిపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారంటూ ఫిర్యాదు చేయాలనుకున్న విజయ్ సేతుపతి ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు. లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్స్ అంటే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు.. భార్య కాదు.. అక్కాచెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరయ్యా అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇంతకీ లక్ష్మి ఎవరనేది థియేటర్లలో చూడాలంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్
Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రషెస్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
మహారాజా ట్రైలర్..
మహారాజా ఫస్ట్ లుక్ ..
#MaharajaFirstLook@Dir_nithilan @PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP @ActionAnlarasu @ThinkStudiosInd @infinit_maze @jungleeMusicSTH @Donechannel1 #VJS50FirstLook #VJS50… pic.twitter.com/7fF5Y2rDao
— VijaySethupathi (@VijaySethuOffl) September 10, 2023