Double Ismart Movie| మూడు వారాల కిందట ప్రారంభమైన డబుల్ ఇస్మార్ట్ చక చక షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి కాగా.. రెండోది మొదలైపోయిందట. బిగ్ బుల్గా సంజయ్ దత్ ఆల్రెడీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. మరోవైపు రామ్ సైతం స్కంధ ప్యాచ్ వర్క్‌ను చూసుకుంటూనే.. ఖాళీ టైం చేసుకుని మరీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇక లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కాస్త సైలెంట్ అయిన పూరి.. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇక అంతా బాగానే జరుగుతుందనుకుంటున్న టైమ్‌లో మ్యూజిక్ విషయంలో కాస్త గంధరగోళం ఎదురైందట.
సంగీత దర్శకుడిగా ఎవర్ని తీసుకోవాలో మేకర్స్‌కు అంతు చిక్కడంలేదట. ఇస్మార్ట్ శంకర్‌కు అదిరిపోయే ఆల్భమ్ ఇచ్చిన మణిశర్మను తీసుకుందామంటే.. ఆయన రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. థమన్ వైపు వెళ్దామంటే ఆయన బడ్జెట్ ౩కోట్లకు పై మాటే. ఇక ఈ మధ్య పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సెన్సేషన్ అయిన భీమ్స్‌ను అనుకున్నా.. ఆయన కూడా దాదాపుగా రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దాంతో ఎవర్ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలో అస్తవ్యస్తం అవుతుందట చిత్రబృందం. అలాగని ఎవరో ఒకర్ని తీసుకుంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఆల్భమ్ అద్భుతంగా ఉంటే చాలు సినిమాపై హైప్ దానంతట అదే వస్తుంది.
గతంలో ఇస్మార్ట్ శంకర్ విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాను లేపింది పాటలే. ఒకటీ, రెండు కాదు ఆల్బమ్‌లోని అన్ని పాటలు చార్ట్ బస్టర్లే. కాస్త అటో ఇటో బేరం కుదుర్చుకొని పేరున్న సంగీత దర్శకుడిని తీసుకోవడమే బెటర్ అని పలువురు నెటీజన్లు తెలుపుతున్నారు. ఎలాగో మ్యూజిక్ రైట్స్ రూపంలో పెట్టిన డబ్బులైతే వస్తాయి కదా అని అంటున్నారు. చూడాలి మరి పూరి ఎవరికి ఫిక్స్ అవుతాడో.