Bigg Boss Telugu 13th week nominations | 13వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారో తెలుసా..?
బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu season 5)నుంచి యాంకర్ రవి (ANchor ravi) ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అప్పుడే వచ్చే వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి 13వ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu season 5)నుంచి యాంకర్ రవి (ANchor ravi) ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అన్యాయంగా రవిని ఎలిమినేట్ చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే అప్పుడే వచ్చే వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి 13వ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. అందులో కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ (shanmukh jashwanth) ను నామినేట్ చేయడానికి వీల్లేదు. మిగిలిన ఆరుగురి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.
అందులో ఐదుగురు నామినేట్ అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రమే ఈవారం నామినేషన్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఇంట్లో షణ్ముఖ్ జస్వంత్, సిరి, సన్నీ, శ్రీ రామచంద్ర, కాజల్, మానస్, ప్రియాంక సింగ్ ఉన్నారు. ఇందులో ఈవారం సన్నీ సేవ్ అయ్యాడు. ఆయనను ఇంటి సభ్యులు ఎవరు నామినేట్ చేయలేదు. మిగిలిన ఐదుగురు ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. ఇందులో ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ ఆగ్రహానికి గురైంది. నామినేషన్స్ ప్రక్రియలో కావాలని ఆలస్యం చేసినందుకు ఈమెపై బిగ్‌బాస్ బాగా సీరియస్ అయ్యాడు.
ఇద్దరిని నామినేట్ చేయకపోతే మీరు స్వయంగా నామినేట్ అవ్వాల్సి వస్తుంది అంటూ బిగ్ బాస్ (Bigg Boss)సీరియస్ అయ్యాడు. ఇక కెప్టెన్ షణ్ముక్ ఈ వారం నామినేషన్స్ లో లేడు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లే అవకాశం ప్రియాంక సింగ్ వైపు ఉంది. అయితే బిగ్ బాస్ చివరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ చేసినా చేస్తాడు. ఎందుకంటే యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడని ఎవరూ అనుకోలేదు. ఆయన కంటే వీక్ కంటెస్టెంట్స్ ను ఇంట్లో ఉంచి రవిని బయటకు పంపించారు. అలా ఈ వారం కూడా ఏదైనా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందేమో చూడాలి.
ఇది కూడా చూడండి
Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
Akhanda Vs Lovestory | లవ్‌స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

