Govinda | బాలీవుడ్ నటుడు గోవింద ప్రమాదవశాత్తు బుల్లెట్ గాయమైంది. ఉదయం లైసెన్స్ రివాల్వర్ కిందపడగా.. బుల్లెట్ దూసుకొచ్చి కాలిలోకి చొచ్చుకు వెళ్లింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నటుడు ఆరోగ్యంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. గోవింద ఆరోగ్యంపై ఆయన భార్య సునీతా అహూజా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చాలా బాగున్నారని.. రేపు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
ఆయన హీరో అని.. త్వరగానే కోలుకుంటారని చెప్పింది. ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉందని తెలిపారు. గోవింది ముంబయిలోని జుహులో నివాసం ఉంటున్నారు. ఓ షోలో పాల్గొనేందుకు కోల్కతా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో రివాల్వర్ని తీసుకుంటుండగా.. చేతిలో నుంచి జారిపోయింది. దాంతో లాక్ కాకపోవడంతో మిస్ఫైర్ అయ్యింది. బుల్లెట్ ఎడమ కాలు మోకాలి వద్ద గాయమైంది. వెంటనే ఆయనను కుటుంబీకులు ఆసుప్రతికి తరలించారు. ఘటనపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రికి చేరుకొని పోలీసులు వివరాలు ఆరా తీశారు.