Whatsapp Romeo | హర్ష రోషన్, హారిక జంటగా కామ్నా జఠ్మలానీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాట్సాప్ రోమియో’. ‘వీడి ప్రేమ అందరిదీ’ అనేది ఉపశీర్షిక. భాస్కర్ రామ్ దర్శకుడు. భిక్షమయ్య నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘పిల్లల్ని చిన్నవయసులోనే ప్రాపర్‌గా గైడ్ చేస్తే వాళ్లు అద్భుతాలు చేస్తారు, సృష్టిస్తారు. అలాంటి ఓ పిల్లాడి కథే మా ‘వాట్సాప్ రోమియో’. ఇందులో హీరో పాత్ర భిన్నంగా ఉంటుంది. అడిషన్స్ చేసి సరైన హీరోహీరోయిన్లను ఎంపిక చేశాం. మధ్యప్రదేశ్, హైదరాబాద్, విశాఖపట్నంలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం.’ అని దర్శకుడు తెలిపారు. ఇంకా నిర్మాత కూడా మాట్లాడారు. అలోక్‌జైన్, శివరాజ్ వాల్వేకర్, గోపాల్ శ్యామ్, మధుసూదన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రంజిత్ ఎం., సంగీతం: జయవర్ధన్.
సుమన్, మురళీగౌడ్, అన్నపూర్ణ, కలకొండ నరసింహ ముఖ్యపాత్రధారులుగా నటించిన పల్లెటూరి కుటుంబకథాచిత్రం ‘మన కుటుంబం’. ఆకుల రాఘవ దర్శకుడు. కలకొండ హేమలత నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమా బాగా వచ్చిందని, అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్, సంగీతం: జె.భానుప్రసాద్.