OG | పవర్ స్టార్ పవన కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాలు నత్తనడకన సాగుతున్నాయి. ఎట్టకేలకి హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేయడంతో ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా షూట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫొటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే పవన్ రాజకీయాల వల్ల ఆగిన ఓజీ సినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది అని ఫ్యాన్స్ సంతోషించేలోపే ఓ నటుడి వలన సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని ఆరే కాలనీలో ఓజీ కొత్త షెడ్యూల్ మొదలు మొదలు పెట్టారు. పవన్ , ఇమ్రాన్ హష్మీల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో షూట్‌కి వచ్చిన ఇమ్రాన్ హష్మీ కాస్త ఇబ్బంది పడ్డారట. అనారోగ్యం బారిన పడినట్లు అర్థం అవుతూ ఉండడంతో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. దాంతో ఇమ్రాన్‌కి డెంగ్యూ అని తెలిసిందట. అయితే వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఈ విషయాన్ని ఇమ్రాన్..సుజీత్, డీవీవీ దానయ్యలకి చెప్పారట. వారు పవన్‌కి ఈ విషయం తెలియజేశారు. మంచి మనసుతో అర్ధం చేసుకున్న పవన్.. ఇమ్రాన్ కోలుకున్న తర్వాతే షూటింగ్ చేద్దాం అని అన్నారట.
సెప్టెంబర్ 25న ‘ఓజీ’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు వారంకి పైగా షూట్‌కి బ్రేక్ పడనుండడంతో సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల హైదరాబాద్ సిటీలో జరిగిన ఓజీ షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో షూట్ జరుపుకుంటుంది. అయితే పవన్, ఇమ్రాన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాల కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ రావడంతో ఆయన అవసరం లేకుండా పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన సన్నివేశాలు తీస్తారేమో చూడాలి.