ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది
ఏవీ నిరుడు కురిసిన హిమ సమూహములు అన్న కవివాక్కు చందంగా గతాన్ని తలచుకొని వైరాగ్యం వ్యక్తం చేశారు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్. కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదని, మార్పును అంగీకరించాల్సిందేనన్నారు.
ఏవీ నిరుడు కురిసిన హిమ సమూహములు అన్న కవివాక్కు చందంగా గతాన్ని తలచుకొని వైరాగ్యం వ్యక్తం చేశారు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్. కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదని, మార్పును అంగీకరించాల్సిందేనన్నారు. ఇటీవలే 80వసంతాల్ని పూర్తి చేసుకున్న ఈ దిగ్గజ నటుడు మారుతున్న కాలం పోకడల్ని, అభిమానుల దృక్పథాన్ని వివరిస్తూ తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఓ ఫిలసాఫికల్ నోట్‌ను పోస్ట్ చేశారు. గతంలో తనను పలకరించడానికి ముంబయిలోని స్వగృహం జల్సా దగ్గరకు ప్రతి ఆదివారం వందల సంఖ్యలో అభిమానులు వచ్చేవారని, ఇప్పుడు ఎవరో కొందరు మాత్రమే కనిపిస్తున్నారని చెప్పారు.
ఒకప్పటి అభిమానుల కేరింతలు మాయమైపోయాయని, ఇప్పుడు మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసుకునే దృశ్యాలే కనిపిస్తున్నాయని ఆవేదన చెందారు. ‘ఎన్నో ఏళ్లుగా ‘సండేమీట్స్’ పేరుతో అభిమానుల్ని కలుస్తున్నా. ఈ మధ్య వచ్చేవారు తగ్గిపోయారు. ఎవరిలోనూ మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఇవన్నీ గమనిస్తుంటే ఏదీ శాశ్వతం కాదని, సమయం మనకోసం ఆగదనే విషయం అర్థమైంది’ అని అమితాబ్‌బచ్చన్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

