Vijay Deverakonda | పెళ్లి చూపులు, గీత గోవిందం సినిమాలతో క్లాస్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్‌తోపాటు ఇండస్ట్రీని షేక్ చేశాడు. తన యాక్టింగ్‌తో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎప్పుడూ ట్రెండీ లుక్‌లో నెట్టింట కనిపించే విజయ్ దేవరకొండ ఈ సారి మాత్రం కాస్త రూటు మార్చేశాడు.
ఎవరూ ఊహించని విధంగా కుర్తా ఫైజామాలో కనిపించి ఔరా అనిపిస్తున్నాడు. రాజసం ఉట్టిపడే రాయల్ లుక్‌లో కనిపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ లుక్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు, అభిమానులు. నీ పెండ్లి కోసం ఎదురుచూస్తున్నా అన్నా.. అని ఓ నెటిజన్ కామెంట్ పెడితే.. మ్యారేజ్ వైబ్స్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు. మొత్తానికి మరి విజయ్ లేటెస్ట్ కొత్త లుక్ ఏదైనా యాడ్ కోసమా..? లేదంటే సినిమా కోసమా..? వేరే ఏదైనా సీక్రెట్ ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ, సమంత (Samantha) కాంబోలో వస్తున్న చిత్రం ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించిన శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న సినిమా విడుదల కానుంది.
విజయ్‌దేవరకొండ రాయల్ లుక్ ..
— Vijay Deverakonda (@TheDeverakonda) April 2, 2023