Lahari Shari | లహరి ఎలిమినేషన్ వెనుక ఏమైనా మతలబు ఉందా..?
బాస్ (Bigg Boss)అంటే ఎవరు ఊహించనిది జరిగేది అని అర్థం. . కొన్నిసార్లు ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే..మరో కంటెస్టెంట్ బయటికి వస్తూ ఉంటారు. బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Season 5 Telugu) 3వ వారం ఎలిమినేషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

బిగ్ బాస్ (Bigg Boss)అంటే ఎవరు ఊహించనిది జరిగేది అని అర్థం. అక్కడ ఎప్పుడు ఎలా ఏది జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈసారి కూడా అదే జరిగింది. కొన్నిసార్లు ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే..మరో కంటెస్టెంట్ బయటికి వస్తూ ఉంటారు. బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Season 5 Telugu) 3వ వారం ఎలిమినేషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లహరి షారీ (Lahari Shari)..ఇంత త్వరగా బయటకు వస్తుందని ఎవరూ ఊహించలేదు.
మరీ ముఖ్యంగా ఆమె తప్పు లేకుండా బయటికి రావడం లహరి ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రవి, ప్రియ విషయంలో జరిగిన గొడవలో లహరి అడ్డంగా బుక్ అయిపోయింది. ఆమె బయటకు రావడానికి ప్రధాన కారణం కూడా ఈ గొడవే. 3వ వారం ఎలిమినేషన్ (Bigg Boss Elimination) విషయంలో ఏదో మతలబు జరిగింది అంటూ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. ఓటింగ్ విషయంలో లహరి కంటే ప్రియాకు తక్కువ ఓట్లు వచ్చాయని..అయినా కూడా కావాలని లహరిని బయటకు పంపించారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎలిమినేషన్ పై అనుమానం రావడం ఇది మొదటి సారి కాదు. గత సీజన్స్ లో కూడా ఇదే జరిగింది.

టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి గత సీజన్ లో మూడో వారం ఎలిమినేట్ అయింది. ఆమె విషయంలో కూడా ఇదే జరిగింది. కావాలని బిగ్ బాస్ ఆమెను బయటకు పంపించారు అని..ఓటింగ్ విషయంలో ఆమె కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా దేవిని ఎలిమినేట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఇప్పుడు లహరి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా ఇంట్లో మరికొన్ని వారాల పాటు ఉండే కంటెస్టెంట్ లహరి అని..అయితే ప్రియాను సేవ్ చేయడానికి ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అంటూ లహరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఈ మతలబులు అన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అనే విషయం బయట పెట్టాలి. అయితే మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు దీని గురించి బిగ్ బాస్ సీక్రెసీ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయం చెప్పకుండా వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు అని.. ప్రతీ వారం అనౌన్స్ చేస్తున్నారు. ఏదేమైనా మూడోవారం లహరి ఎలిమినేషన్ మాత్రం నిజంగా ఊహించనిది. మరి ఈ సీజన్ లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఎలిమినేషన్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

