టాలీవుడ్లో జ్యోతిష్యాన్ని నమ్మే హీరోల్లో నందమూరి బాలకృష్ణ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఆ తర్వాత స్థానంలో పవన్‌కల్యాణ్ ఉంటారని అంతా అంటుంటారు. తాజాగా వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్‌కల్యాణ్ స్టిల్ ను జూమ్ చేసి చూసిన తర్వాత ఇది నిజమేనని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ ప్రభావం పవన్‌కల్యాణ్ పై చాలా ఉంటుందని, అందుకే పవన్ కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నాడని టాక్ ఉంది.
త్రివిక్రమ్ మత గురువు మార్గదర్శకత్వంలో ఉపనయనం చేశాడట పవన్‌కల్యాణ్. ఇప్పటికే పవన్ జంధ్యం (యజ్ఞోపవీతం) ధరించాడని చాలా మంది అంటున్నారు. పవన్ చేతి వేలికి స్నేక్ రింగ్ ఉంది. త్రివిక్రమ్ గురువు సూచనల మేరకే పవన్‌కల్యాణ్ తన చేతికి ఇలాంటి ప్రత్యేకమైన ఉంగరాన్ని పెట్టుకున్నాడట.
సాధారణంగా ఇలాంటి ఉంగరాలు ఎవరూ పెట్టుకోరు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తేనే ఈ రింగ్స్ పెట్టుకుంటుంటారు. మరి ఆ స్నేక్ రింగ్ వెనకున్న ఆంతర్యం ఏంటో పవన్‌కు మాత్రమే తెలుసుంటుంది.