Hyderabad | హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. హాసన్ నగర్లో మతిస్థిమితం లేని ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
యువతి ఒంటరిగా ఉన్నది గమనించిన వ్యక్తి.. ఇంట్లోకి చొరబడి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడి పారిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఇది గమనించి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన అఖిల్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. వైద్య సేవల నిమిత్తం బాధిత యువతిని ఆస్పత్రికి తరలించారు.