sushant singh rajput | సుశాంత్ రాజ్‌పుత్ ఫ్రెండ్స్‌కు ఏమైంది.. ఆ బ్యాచ్‌లో నలుగురు ఆత్మహత్య!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాచ్‌లో అతడితో కలిపి ఇప్పటి వరకు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరస మరణాలను చూసి అంతా షాక్ అవుతున్నారు.. కొందరు అయితే అనుమానాలు కూడా రేకెత్తేలా మాట్లాడుతున్నారు.
sushant singh rajput | వింటుంటూనే అయ్యో పాపం అనిపిస్తుంది కదా..? కానీ ఏం చేస్తాం.. నిజంగాను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాచ్‌లో అతడితో కలిపి ఇప్పటి వరకు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరస మరణాలను చూసి అంతా షాక్ అవుతున్నారు.. కొందరు అయితే అనుమానాలు కూడా రేకెత్తేలా మాట్లాడుతున్నారు. కానీ ప్రతీ మరణం కేవలం ఆత్మహత్యగానే మిగిలిపోతుంది. తాజాగా ప్రముఖ సీరియల్ నటి.. 30 ఏళ్ళ వైశాలి ఠక్కర్ మరణం కూడా సంచలనంగా మారుతుంది.
ఈమె సుసైడ్‌కు ఆమె ప్రియుడు కారణమంటూ నోట్ కూడా లభించింది. దాంతో ఈ కేసు ఎటు వైపు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. తనను కాదని మరొకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వైశాలిని.. ఆమె ప్రియుడు మానసికంగా వేధించాడని తెలుస్తుంది. అందుకే ఆమె ప్రాణాలు తీసుకుందని సన్నిహితులు చెప్తున్నారు. ఈమె సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మంచి స్నేహితురాలు కావడం గమనార్హం.
అలాగే 2021 ఫిబ్రవరి 15న సుశాంత్ మరో స్నేహితుడు సందీప్ నహార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌లో సుశాంత్‌తో కలిసి నటించాడు ఈయన. అతడి మరణానికి కారణం కుటుంబ పరిస్థితులు అని తర్వాత తేలింది. ముఖ్యంగా భార్యతో గొడవల కారణంగానే సందీప్ సూసైడ్ చేసుకున్నట్లు అతడి ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించారు. ఈ వరుస చావులకు బీజం పడింది మాత్రం 2020 జూన్ 9న. ఆ రోజు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బెస్ట్ ఫ్రెండ్.. అతడి మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకుంది.
ఈమె మరణం కూడా సహజం కాదని.. ఆమెను ఎవరో చంపేసారని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ పోలీసులు మాత్రం మిస్టరీ డెత్‌లా కాకుండా సూసైడ్గానే కేసు క్లోజ్ చేసారు. ఆమె చనిపోయిన 5 రోజులకు.. అంటే జూన్ 14, 2020న సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. కేవలం 34 ఏళ్ళ వయసులోనే ఈయన చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడని ఆయన అభిమానులు మండి పడ్డారు. ఇప్పటికీ ఆ ఎఫెక్ట్ బాలీవుడ్‌పై కనిపిస్తుంది. మొత్తానికి సుశాంత్ స్నేహితులు ఇలా వరసగా మరణించడం మాత్రం నిజంగానే అందరినీ కలిచి వేస్తుంది. పైగా అందరి వయసు 35 ఏళ్ళ లోపే ఉండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Priyamani DR56 look | ప్రియమణి DR56 ఫస్ట్ లుక్.. లాంఛ్ చేసిన విజయ్ సేతుపతి
Read Also : Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

